Saturday, 9 December 2017

తెలుగు భాష అనేది నన్నయాదులకంటే ముందు ఉంది .. కానీ ఆంధ్ర భోజునిగా మరియు ఆంధ్ర కన్నడ రాజ్య రమారమణునిగా కీర్తించబడిన శ్రీ కృష్ణదేవ రాయలు తెలుగు భాషకు చేసిన సేవ ఎనలేనిది. ఈయన కాలములో తెలుగు భాష పట్టం గట్టుకుని పల్లకీలలో ఊరేగింది. గండ పెండేరాలు వేయించుకుని, కనకాభిషేకాలు చేయించుకుని స్వయంగా రాయల చేత పల్లకీ మోయించుకుంది . పాలకుడే కవి , సాహితీ వేత్త అయితే సాహితీ సరస్వతికి కళలకు ఆదరణ కరవవుతుందా ? రాయల వారు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలికిన పలుకులు ఇవి.నేటి పాలకులు కొందరు యాసను భాషంటారు. మరికొందరు భాషకే ప్రాముఖ్యత నివ్వరు. ఏ దేశమైనా దాని సంస్కృతీ సౌరభాలు నలువైపులా విరియాలంటే భాష, కళలు ముఖ్యం. సంస్కృతి అంటే భవనాలు, సంపదలు, రంగు రంగుల విద్యుద్దీపాలు, ప్రాజెక్టులు అని భ్రమించే వారు పాలకులు అయితే భాష, సంస్కృతి, కళలు వర్ధిల్లుతాయా ? ఇపుడు ప్రజలూ ఆదరించరు.. పాలకులు ఆదరించరు .. సంగీత నాట్య కళాకారులెపుడో వలస పోయారు ఆదరణ కరువై.. ఇపుడు సాహిత్య కళాకారులు వలస వెళ్ళినా అంతులేని ప్రాంతీయ భేధాలు.
సాహితీ సార్వభౌముడు రాయల వారు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలికిన పలుకులు ఇవి.
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స, ”. —శ్రీ కృష్ణదేవ రాయలు
నాటి రోజులు మరలి రావా ? సాహితీ సరస్వతి పట్టం కట్టుకుని ఊరేగు దినాలు , లలిత కళలు భాసిల్లు రోజులు మరలి రావా ? అదంతా ఒకనాటి కలయేనా ?
LikeShow more reactions
Comment

No comments: