Saturday, 9 December 2017

 *సమస్యాపూరణం* 
పూరించవలసిన సమస్య ఇది....
*"రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్"* 
(కందం)
(లేదా...)
*"రాయల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్"*
(ఉత్పలమాల)
పై సమస్యలకు నా పూరణలు.....
మాయని కీర్తి మిగిల్చెను
రాయలకున్ దెలుగు , రాదు రసముల గ్రోల
న్నీ యాధునికుల కాంగ్లపు
మాయన మునిగిన సమాజ మందున గనన్
తీయదనమ్ములో దెనుగు తేనెను మించిన భాషయంచు నా
కోయిల పాటకన్న సుమ కోమలమంచును చెప్పినందుకే
మాయగ లేని కీర్తిగల మాన్యత గూర్చెను విశ్వమందునా
రాయల వారికిన్ దెలుగు, రాదుగదా రసమున్ గ్రహింపగన్
బోయిలు లేని పల్లకియె భూమిఁ దెలుంగనెడాంగ్లప్రేమికుల్.

No comments: