రాజవిద్యారాజగుహ్యయోగః 4 (అథ నవమోధ్యాయః, శ్రీ భగవద్గీత)
శుభాశుభఫలై రేవం
మోక్ష్యసే కర్మబంధనైః
సన్మ్యాసయోగయుక్తాత్మా
విముక్తో మాము పైష్యసి.
ఈ ప్రకారముగ 'కర్మసమర్పణ' యోగముతో గూడినవాడవై పుణ్యపాపములు ఫలములుగాక కర్మ బంధములనుండి నీవు విడువబడగలవు. అట్లు విడువడిన వాడవైనన్ను పొందగలవు.
సమోహం సర్వభూతేషు
నమే ద్వేష్యోస్తి న ప్రియః,
యే భజంతి తు మాం భక్త్యా
మయి తే తేషు చాప్యహమ్.
నేను సమస్తప్రాణులందును సమముగా నుండువాడను. నాకొకడు ద్వేషింపదగినవాడుగాని, మరియొకడు ఇష్టుడుగాని ఎవడును లేడు. ఎవరు నన్ను, భక్తితో సేవించుదురో వారు నాయందును, నేను వారియందును ఉందును .
అపి చేత్సుదురాచారో
భజతే మామనన్యభాక్,
సాధు రేవ స మంతవ్య
స్సమ్యగ్వ్యవసితో హి సః.
మిక్కిలి దురాచారముగలవాడైనప్పటికిని అనన్య భక్తికలవాడై (ఇతరమగు దేనియందు భక్తినుంచక ఆశ్రయింపక) నన్ను భజించునేని, అతడు సత్పురుషుడనియే (శ్రేష్ఠుడనియే) తలంపబడదగినవాడు. ఏలయనగా అతడు స్థిరమైన (ఉత్తమ) మనోనిశ్చయము గలవాడు.
క్షిప్రం భవతి ధర్మాత్మా
శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి,
కౌంతేయ ప్రతిజానీహి
న మే భక్తః ప్రణశ్యతి.
అతడు (నన్నాశ్రయించిన పాపాత్ముడు) శీఘ్రముగ ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు. మరియు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు. ఓ అర్జునా 'నా భక్తుడు చెడడు' అని ప్రతిజ్ఞ చేయుము!
మాం హి పార్థ వ్యపాశ్రిత్య
యేపి స్యుః పాపయోనయః,
స్త్రియో వైశ్యా స్తథా శూద్రా
స్తేపి యాంతి పరాంగతిమ్.
ఓ అర్జునా! ఎవరు పాపజన్మము (నీచజన్మము) గలవారై యుందురో, వారును, స్త్రీలును, వైశ్యులును, అట్లే శూద్రులును నన్నాశ్రయించి సర్వోత్తమ పదవిని (మోక్షమును) నిశ్చయముగ పొందుచున్నారు.
కిం పునర్బ్రహ్మణాః పుణ్యా
భక్తా రాజర్షయ స్తథా,
అనిత్యమసుఖం లోక
మిమం ప్రాప్య భజస్వమామ్.
ఇక పుణ్యాత్ములగు బ్రాహ్మణుల విషయమునను, భక్తులగు రాజర్షుల విషయములను మరల జెప్పనేల? (భగవదాశ్రయముచే వారున్ను తప్పక ముక్తినొందుదురని భావము). కావున అశాశ్వతమైనట్టి ఈలోక మునుపొందుయున్న నీవు నన్ను భజింపుము.
మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు,
మా మేవైష్యసి యుక్త్వైవ
మాత్మానం మత్పరాయణః.
నా యందే మనస్సుగలవాడవును, నాభక్తుడవును నన్నే పూజించువాడవును అగుము. నన్నే నమస్కరింపుము. ఈ ప్రకారముగ చిత్తమును నాయందే నిలిపి నన్నే పరమగతిగ నెన్నుకొనినవాడవై తదకు నన్నే పొందగలవు.
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, రాజవిద్యారాజగుహ్యయోగోనామ నవమోధ్యాయః
No comments:
Post a Comment