Sunday, 8 July 2018


సమైక్య కాపు



జర్నలిజం 99.99% చచ్చిపోయింది అనేకంటే అమ్ముడుపోయింది అనటం బెటర్. అలాంటి గంజాయివనంలో తులసి మొక్కలాగా జర్నలిస్ట్ సాయి గారు ఒక్కరున్నారు. ఆయన వలనే 0.01%అయిన జర్నలిజం మీద నమ్మకం ఉంది. సాయి గారు ప్రముఖ AP 24x7 లో పనిచేస్తున్నారు. ఆ ఛానల్ మొదట్లో న్యాయానికి నమ్మకంగా పనిచేసేది. కానీ మెల్లమెల్లగా అందులో పనిచేసేవాళ్ళంతా డబ్బుకు అమ్ముడుపోవడం మొదలుపెట్టారు, ఒక్కడు తప్ప. ఆ ఒక్కడే జర్నలిస్ట్ సాయి గారు. డబ్బు ఆశ చూపించారు లొంగలేదు, బయపెట్టారు బయపడలేదు ఆ పచ్చ గూండాలకు. అన్ని మీడియా సంస్థలు పచ్చ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న వేళా ఇతనొక్కడే కొరకరాని కొయ్యల తయారైయ్యాడు. చివరికి నిన్న రాత్రి సమయాన తన కుటుంబ సభ్యులను బ్రతకనివ్వం అని బెదిరించేసరికి ఆ ఒక్క నమ్మకం కూడా తలొగ్గాల్సొచ్చింది. అందుకనే నిన్నటినుంచి సాయి గారు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ అన్యాయాన్ని న్యాయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిజాన్ని బతకనివ్వని దిశగా పచ్చ మాఫియా అడుగులేస్తుంది.





No comments: