భయంకర వ్యాధులకు భయం చూపిన తెలుగు బిడ్డడు
తన తమ్ముడు పదిరోజులుగా బాధపడుతున్నాడు. రక్తహీనత వల్ల నానాటికీ కృషించిపోతున్నాడు . పలుమార్లు విరేచనాలవుతున్నాయి. వ్యాధి మరింత తీవ్రమై మరణానికి దగ్గరగా ఉన్న తమ్ముని బాధను చూస్తూ నిస్సహాయుడై నిల్చున్నాడు అన్న. పెద్ద వైద్యం చేయించేందుకు డబ్బుల్లేని వాడా బాలుని తండ్రి. చూస్తున్నట్లే తమ్ముడు శాశ్వతంగా కన్నుమూసి తన అన్నలో కసి రేపాడు . పన్నెండేళ్ళ అన్న కన్నీరు కారుస్తూ 'ఈ రోగానికి మందే లేదా?' అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు.భయంకరమైన ఈ వ్యాధిని నిర్మూలించాలి. ఇందుకు మందు కనిపెట్టాలి. నేను డాక్టర్ కావాలి అని నిశ్చయించుకొన్నాడు ఆ బాలుడు. ఆ బాలుడి దీక్ష, నిరంతర శ్రమ, పరిశోధనల వల్ల తన తమ్ముని బలిగొన్న 'స్ప్రూ' వ్యాధిని నిర్మూలించుటకు మందును కనుగొన్నారు .క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల గొప్ప మందులను కనుగొన్నారు.
గొప్ప వైద్యశాస్త్రవేత్తగా ప్రపంచ ప్రజల మన్ననలందుకున్న తెలుగు తేజం డా. యల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి నేడు. మన తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటిన సుబ్బారావు గారి పేరుని మంగళగిరి AIIMS కి పెడితే అద్భుతంగా ఉంటుంది.. కానీ మన తెలుగు పాలకులకు ఇక్కడి గొప్పవారు తెలియదు.. తెలిసినా నచ్చరే ..
No comments:
Post a Comment