నా దేశం ప్రపంచానికి పూజ గది. జీవుడే దేవుడు, కుల అంటరానితనమే హిందూస్థాన్ కి పట్టిన గ్రహణం అన్న స్వామి వివేకానంద సూక్తులు .
1. సమస్త గ్రంధాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది. అంతకంటే వేయిరెట్లు ఎక్కువగా ఉంది .ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడు కోల్పోవద్దు .ఈ విశ్వం లో నువ్వు దేన్నైనా సాధించగలవు .ఎన్నడు దౌర్బల్యానికి లోనుగాకు .సమస్త శక్తి నీదే .
2 మనకు శ్రధ్దకావాలి ,ఆత్మ విశ్వాసం కావాలి .బలమే జీవనం,బలహీనతే మృత్యువు .”మేము అత్మస్వరుపులం ,మృత్యురహితులం ,ముక్తులం ,పవిత్రులం ,స్వభావ సిద్ధంగా పరిసుద్దులం .అటువంటి మేము ఎప్పుడైనా ఏ పాపమైన చేస్తామా ?….అసంభవం !ఇటువంటి విశ్వాసం కావాలి అటువంటి విశ్వాసం మనల్ని మనుషులను చేస్తుంది .దేవతలను చేస్తుంది .ఈ శ్రధ్దాభావం లోపించటం వల్లనే దేశం నాశనమై పోయింది .
3 ఏ వ్యక్తి అయిన ,ఏ దేశమైన ఉన్నత స్తితికి చేరుకోవాలంటే మూడు లక్షణాలు అవసరం అవి –
మంచితనానికి వున్న శక్తి మేధా అకండ విశ్వాసం .
అసూయా ,అనుమానం లేకుండా వుండటం .
మంచిగా ఉండాలనుకునే వారికీ ,మంచి చేయతలుచుకునే వారికీ తోడ్పడటం
మంచితనానికి వున్న శక్తి మేధా అకండ విశ్వాసం .
అసూయా ,అనుమానం లేకుండా వుండటం .
మంచిగా ఉండాలనుకునే వారికీ ,మంచి చేయతలుచుకునే వారికీ తోడ్పడటం
4 మీ భాగ్యానికి మీరే గధా కర్తలు .మీ వ్యధలకు మీరే కారకులు .మంచి చెడులను సృస్టించుకునేది మీరే .చేతులతో కళ్ళు మూసుకొని చీకటి అంటున్నది మీరే .చేతులను తీసివేసి వెలుతురును చూడండి .
5 ఇతరులకు ఏ కొద్ది పాటి మంచి చేసిన అది మనలో వున్న శక్తిని మేల్కొలుపుతుంది .క్రమంగా అది మన హృదయంలో సింహ సాద్రుసమైన బలాన్ని నింపుతుంది .
6 నీ పై ఎవరో ఆధారపడి ఉన్నారని ,నివతనికి మంచి చేయగలవని తలచడం వట్టి మనో దౌర్బల్యం .ఈ తలంపే మన సమస్తే బంధనాలకు పుట్టినిల్లు.అంతుగాక సమస్తే బాధలకు ఈ మమకార బావనే మూలకారణం .అందువల్ల నిస్సంగత్వాన్ని అలవర్చుకోవాలి .అంటే బందానాన్ని విడనాడటం ఈ జీవతంలో నేర్పవలసిన గొప్ప పాఠం .దిన్ని పూర్తిగా నేర్చుకుంటే మనకెన్నడు అశాంతి కలగదు .ఈ నిస్సంగత్వం ఏ శక్తి నీమీద ప్రభావం చూపకుండా నివు అధిగమించగలవు , త్రోసిపుచ్చనూగలవు .
7 సత్యానికి ,మానవాళికి ,నీ దేశానికీ విస్వాసపాత్రుడవై ఉండు .నువ్వు ప్రపంచాన్ని కదిలించి వెయ్యగలవు .
8 దేనికీ బయపడకండి .మీరు అద్భుతాలను సాధించగలరు .బయపడిన మరుక్షణమే మీరు ఎందుకు పనికిరాని వారవుతారు .లోకంలోని దుఖఃమంతటికి మూలకారణం ఈ బయమే ! భయమే సర్వబంధకారిని .నిర్భయత్వం ఒక్క క్షణంలో సైతం స్వర్గాన్ని ప్రాప్తిచేయగలదు.
9 ప్రతిఘటన ,వ్యతిరేఖత ఎంత వుంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికే వేగము వస్తుందా? ఒక విషయం ఎంత క్రొత్తదైతే ,ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది అంత వ్యతిరేఖతను ఎదురుకోవలసింది .వ్యతిరెఖతంతా విజయ సుచకమే .
10 కొద్ది మంది వ్యక్తులు మనో వాక్కర్మలయందు ఒకటైతే ప్రపంచాన్ని ఉర్రుతలూగించగలరు .ఈ సత్యాన్ని ఎన్నడు మరువకండి .
11 ఇది తలవ్రాత అని మూర్కుడు ,పిరికివాడు మాత్రమే వచిస్తారని ఒక సంస్కృత సూక్తి .బలవంతుడు తలవ్రాతకు నేనే కారకున్ని అని దైర్యంగా నిలిచి చెప్తాడు .వృధ్దాప్యం లో అడుగుపెడుతున్న వారె అదృష్టాన్ని గూర్చి మాట్లాడతారు .
12 మన వర్తమాన స్థితి పూర్వకర్మల ఫలితమైతే మనకు భవిష్యత్తులో కలిగే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొంధవచని నిచ్చితమగుతున్నది .కాబట్టి పనులను ఎలా ఆచరించాలో మనం తెలుసుకోవాలి .ఇలా కర్మలను చేసే విదానం తెలుసుకొంటే అద్భుత ఫలితాలను పొందవచ్చు .అల్పకార్యాలుగా పరిగణింపబడే వాటిని కూడా త్రునీకర బావంతో చేయకూడదు .
13. మిమ్మల్ని మీరు మహాపురుషులని బావించండి! అప్పుడు మీరు మహాపురుషులే అవుతారు .మన అందరిలో ఆ దివ్యాత్మ ఉంది .దీనిని మనం విస్వసిస్తాం గాక !
14 కాదు ,నాకు చేతకాదు అని ఎన్నడు అనవద్దు .మీరు అనంతులు .మీ స్వభావంతో పోల్చితే దేశకాలాలు అన్ని అల్పమై తోస్తాయ్ .మీరు సర్వశక్తి సంపన్నులు ,దేనిని చేపట్టితే దానిని సాధించగలరు .
15. నీవు దీనుడవని తలిస్తే దీనుడవే అవుతావు .బలవంతుడవని తలిస్తే బలవంతుడవే అవుతావు .
16. గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగృతులు కండి.
17. దీర్ఘ (?) అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు.
18. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.
19. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.
20. మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.
21. మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..
22. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..
23.కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు..
24. మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.
25. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది.. ఇలా ఎన్నో ఎన్నెన్నో...
స్వామీ వివేకానంద హిందూ యోగి:
👉స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో - ఇందులో స్వామి బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు - "ఒక అనంతమైన స్వచ్ఛమైన మరియు పవిత్రమైనది, ఆలోచనకి మరియు నాణ్యత ప్రమాణాల పరిధి దాటినదైనదానికి నేను నమస్కరిస్తున్నాను ".

1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో - ఇందులో స్వామి బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు - "ఒక అనంతమైన స్వచ్ఛమైన మరియు పవిత్రమైనది, ఆలోచనకి మరియు నాణ్యత ప్రమాణాల పరిధి దాటినదైనదానికి నేను నమస్కరిస్తున్నాను ".


బాల్యం:
👉నరేంద్ర నాథుడు కలకత్తా, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వివెకనందునికి చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం, మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి.


రామకృష్ణ పరమహంసతో పరిచయం:
👉రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో ఆయనను తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదోవిధమైన తాద్యాత్మత ("ట్రాన్స్") లోకి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.




తండ్రి మరణం:
👉నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బి.ఎ పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బి.ఎ పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆకుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.



వివేకానందుడిగా మార్పు:
👉నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.



విదేశాలలో సమ్మేళనం ప్రసంగం:
👉జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు ఆయన గొప్పతనమేమిటో అర్థం అయింది. ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు. స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గరా ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.




ముఖ్య సూత్రములు తత్త్వములు;
👉వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్త్వ శాస్త్రములో నే కాకుండా, సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవతో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతిలో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహమును కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము) ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" (आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.


మరణం:
👉అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి
వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ, మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దు:ఖించారు.

వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ, మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దు:ఖించారు.

జై హింద్..!
🇮🇳

No comments:
Post a Comment