రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 1 January 2018
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు.. కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు దొమ్ములు సేసిన యట్టి తొండ మాం చక్కుర వర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు.. అచ్చపు వేడుకతోడ ననంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు.. కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు మంచివాడై కరుణ బాలించినవాడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment