Monday, 1 January 2018

జయ జయ రామా సమరవిజయ రామా భయహర నిజభక్తపారీణ రామా జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా. అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా

No comments: